స్కూల్ వ్యాన్ కిందపడి బాలుడి మృతి
BSBNEWS - కందుకూరు
మండలంలోని అనంతసాగరం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వివరాల లోకి వెళితే కందుకూరులోని గౌతమి స్కూల్ లో చదువుతున్న అనంతసాగరం గ్రామానికి చెందిన విద్యార్థిని తీసుకురావడానికి వెళ్లిన గౌతమి స్కూల్ వ్యాను వెళ్ళింది. అయితే స్కూలు విద్యార్థి వ్యాను ఎక్కేటప్పుడు గోగినేని శ్రీకాంత్, నాగమణి కుమారుడు మోక్షి వ్యాను కిందికి వెళ్లాడని అది గమనించని స్కూల్ వ్యాను డ్రైవర్ వ్యానును కదిలించడంతో మోక్షి అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలుపుతున్నారు. విషయంపై స్కూల్ ప్రిన్సిపాల్ మాలకొండయ్యను వివరణ అడగగా స్కూలు వ్యాను అనంతసాగరం గ్రామానికి వెళ్లడం జరిగిందని, విద్యార్థి బస్సు కిందకు వెళ్లడం గమనించక డ్రైవర్ బస్సుని మూవ్ చేశాడు తప్ప బాబు పైకి దురుద్దేశంతో ఎక్కించలేదని చెప్పటం గమనార్హం. నిజానికి స్కూల్ వ్యాన్ కు సంబంధించి ఒకరు డ్రైవరు, మరొకరు క్లీనర్ గా ఉండాలి కానీ ఆ స్కూల్ వ్యాన్ కి డ్రైవర్ మాత్రమే ఉన్నాడని క్లీనర్ సెలవు పెట్టాడని మాలకొండయ్య చెప్పడం జరిగింది. సంబంధిత అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటివి అనేక సంఘటనలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.

