సాగునీటి ఎన్నికల్లో కూటమి హవా
మొత్తం 47 సాగునీటి సంఘాలు ఏకగ్రీవం..
ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపిన అధ్యక్షులు, మెంబర్లు
BSBNEWS - కందుకూరు
కందుకూరు నియోజకవర్గ రైతులు, ప్రజలు తన పై, కూటమి ప్రభుత్వం పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. కందుకూరు నియోజకవర్గంలో జరిగిన 45 సాగునీటి సంఘాల ఎన్నికల్లో గెలిచిన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, టిసి మెంబర్లు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గంలో మైనర్ చెరువులు 35, మీడియం 6 చెరువులు ఎన్నికలు ఏకగ్రీవం కావటం జరిగిందని తెలిపారు. టిడిపి, బిజెపి, జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగిందన్నారు. కాలువలను, చెరువులను అభివృద్ధి చేసుకుంటూ చివరి ఆయకట్టు వరకు ప్రతి ఎకరాకు నీరందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలవడానికి కృషి చేసిన ప్రతి ఒక్క రైతును అభినందిస్తున్నానని, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా, ఈ కష్టం రాకుండా జాగ్రత్తగా చూసుకుంటానని తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుకి సాగునీటి సంఘాల అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులు, మెంబర్ లుగా గెలుపొందిన వారు ధన్యవాదములు తెలిపారు.