నీటికోసం రోడ్డు ఎక్కిన రాళ్లపాడు రైతాంగం

0

 నీటికోసం రోడ్డు ఎక్కిన రాళ్లపాడు రైతాంగం 

- ఆత్మహత్యలే శరణ్యం అంటున్న రైతులు 

- ఉన్నతాధికారులకు, ప్రజా ప్రతినిధులకు మా గోడు వినిపించలేదా...? 

- టెక్నీషియన్లను వెనక్కి పంపించడంలో మర్మమేమిటో.?

- ఆత్మహత్యకు పాల్పడిన రైతు.. అడ్డుకున్న పోలీసులు

- ఉద్రిక్తంగా రాళ్లపాడు రైతుల ఆందోళన

BSBNEWS - కందుకూరు 


నియోజకవర్గంలోని లింగసముద్రం మండలం రాళ్లపాడు ప్రాజెక్టు నుండి నీటిని ఎందుకు వదలడం లేదని రాళ్ళపాడు రైతాంగం రోడ్డుపై బైఠాయించింది. గత 15 రోజుల నుండి నీళ్లు కావాలని రైతులు పోరాటం చేస్తున్నా ఇప్పటివరకు జిల్లా అధికారులు ఎందుకు స్పందించడం లేదని సూటిగా రైతులు ప్రశ్నిస్తున్నారు. రాళ్లపాడు ప్రాజెక్టులో అక్రమ చేపల మాఫియాతో అధికారులు, నాయకులు కుమ్మక్కై మా రైతుల చావులకు కారణమవుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గత రెండు రోజుల క్రితం ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చి సమస్య పరిష్కరించాం ఇకపై నీళ్లు వస్తాయి అని రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేసి రైతులపై రాజకీయాలు చేయడం సరి కాదన్నారు. మాకు నీళ్లు ఇవ్వకపోతే మా చావులకు అధికారులు, నాయకులే కారణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్టు కింద దాదాపు 25వేల ఎకరాలు భూమి సాగు చేస్తున్నామని, రైతులకు రాళ్లపాడు ప్రాజెక్టు వరం లాంటిదని, కానీ అది పేరుకే తప్ప మాకు ఎటువంటి ఉపయోగం లేకుండా మధ్యవర్తులు రాజకీయ నాయకులతో కలిసి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కరించడానికి విశాఖపట్నం నుంచి టెక్నీషియన్లు వచ్చి సీసీ కెమెరాలు ద్వారా ఎక్కడ సమస్య ఉంది తెలుసుకోవడానికి వచ్చిన టెక్నీషియన్ లను అధికారులు పంపించారంటే మాఫియాతో కలిసి కావాలని గేట్లకు సమస్య వచ్చేలా చేశారని రైతులు ఆరోపించారు. గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని ఈ సంవత్సరం వర్షాలు పడ్డ, సొంత ఖర్చులతో నీటిని కొనుక్కొని పంటలు పండిస్తున్నామని వాటి వల్ల అప్పులపాలై ఇబ్బందులు పడుతున్నామని అయినా ఏనాడు ఎవరిని ప్రశ్నించలేదని మా అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని రాళ్లపాడు ప్రాజెక్టు అధికారులు, నాయకులు కలిసి చేపల మాఫియాతో చేతులు కలిపి మాకు నీళ్లు రాకుండా చేస్తున్నారని ఇకపై సహించేది లేదని మాకు నీళ్లు ఇచ్చేంతవరకు మా ఈ పోరాటం కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.

Post a Comment

0Comments
Post a Comment (0)