రావుల వెంకయ్యకు ఘన సన్మానం

0

రావుల వెంకయ్యకు ఘన సన్మానం

BSBNEWS - నెల్లూరు 


ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కాబడినందుకు రావుల వెంకయ్యకు సిపిఐ జిల్లా కార్యాలయంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు షాన్ వాజ్ అధ్యక్షతన సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కందుకూరు వాసిగా రావుల వెంకయ్య ఏఐకెఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం మన అందరికీ గర్వకారణమని అన్నారు. రైతు సంఘం జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు కె.వీరారెడ్డి మాట్లాడుతూ రావుల వెంకయ్యతో ఉన్న సాన్నిహిత్యం గురించి వివరించారు. రావుల వెంకయ్య ఈ స్థాయికి రావడానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని, ఆయన కృషికి జాతీయ స్థాయిలో గొప్ప గౌరవం దక్కిందని ఆయన అన్నారు. రైతు సంఘాల సమైక్య నాయకులు కోటిరెడ్డి, రైతు సంఘం కార్యదర్శి రమణయ్య, రామరాజు, సిపిఐ నగర సహాయక కార్యదర్శి సిరాజ్, సిపిఐ కందుకూరు నియోజకవర్గం బి సురేష్ బాబు, ఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి మున్నా, విశాలాంధ్ర జిల్లా బ్యూరో దయాశంకర్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)