మార్కెట్ కు అనుగుణంగా బేల్స్ తీసుకొనిరావాలి

0

మార్కెట్ కు అనుగుణంగా బేల్స్ తీసుకొనిరావాలి 

పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  బి. విశ్వశ్రీ

 BSBNEWS - KANDUKUR 


శుక్రవారం పొగాకు బోర్డు సెక్రటరీ దివి వేణుగోపాల్,  తేలిక నేలల ప్రాంతీయ అధికారి లక్ష్మణ్ రావు  తో కలిసి కందుకూరు లోని రెండు వేలం కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు వేలం జరిగే విధానాన్ని పరిశీలించి బయ్యర్లు రైతులకు మంచి ధరలు ఇవ్వాలని కోరారు. ప్రస్తుత మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని వేలం లో వెళ్ళే బెల్స్ మాత్రమే తీసుకురావాలని రైతులను కోరారు. వారు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పొగాకు ఉత్పత్తి నీ వివరించారు. పొగాకు బోర్డు ఎప్పుడూ రైతుల మంచి కోసమే పని చేస్తుందని తెలిపారు. వేలం కేంద్రాలకు వచ్చే ముందు ఒకసారి తమ పొగాకు బేళ్ళను సరి చూసుకోవాలని తేమ, వేడి, షాఫ్ట్ లేకుండా చూడాలని అన్నారు. రైతు సోదరులు కచ్చితంగా గ్రేడింగ్ చేయాలని కోరారు. గ్రేడింగ్ సరిగా చేయక పోతే మార్కెట్ జరపడం కష్టం అని చెప్పారు. ఆ తరువాత కంపెనీ ప్రతినిధులతో మీటింగ్ నిర్వహించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, నో బిడ్ లు తగ్గేలా చూడాలని సూచించారు. తదనంతరం పొగాకు బోర్డు సిబ్బంది తో సమావేశం నిర్వహించి వేలం సజావుగా సాగడానికి తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు, రైతులు బోర్డు సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)