కందుకూరు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం - మొదలైన ఆక్రమణ తొలగింపు

0

 ఐఎన్ఆర్ మార్క్ ప్రారంభం

కందుకూరు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం 

మొదలైన ఆక్రమణ తొలగింపు

ఎమ్మెల్యే కు ప్రశంసలు

BSBNEWS - కందుకూరు 




కందుకూరు పట్టణంలో ఐఎన్ఆర్ మార్కు ప్రారంభమైందని కందుకూరులోని ట్రాఫిక్ కష్టాలకు ఇక చెక్ పెట్టేందుకు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశాలతో మున్సిపల్ అధికారులు ముందడుగు వేశారని కందుకూరు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ప్రధానమైన కూడళ్ళను ఎంచుకుని పనులు మొదలు పెట్టారు. తాత్కాలికంగా కొంతమందికి నష్టం కలిగినా దీర్ఘకాలంలో వేలాది మందికి ప్రయోజనం కలిగే విధంగా పనులు చేస్తున్నారు. అభివృద్ధికి అడ్డుగా ఉండే కొన్నింటిని అధికారులు ముందస్తు సమాచారం ఇచ్చి నిబంధనల ప్రకారం తొలగిస్తున్నారు. ముందుగా పట్టణానికి సింహ భాగమైన నైరుతి వైపు నుండి పట్టణ అభివృద్దికి కొబ్బరి కాయ కొట్టారు. మాలకొండ పామూరు రోడ్డు జంక్షన్ వద్ద ఏళ్ల తరబడి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఉన్న షాపులను సోమవారం ఉదయం అధికారులు తొలగించారు. దీంతో పట్టణ ప్రజలు, పలు గ్రామాల ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధి అనేది మాటల్లో కాదు చేతల్లో చూపెట్టాలి అనే తలంపుతో స్ధానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పని చేస్తున్నారని పలువురు అంటున్నారు.  పట్టణంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరగాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. పట్టణ సుందరీకరణకు ప్రజలు అందరూ పూర్తిగా మద్దతు తెలిపి అధికారులకు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. కందుకూరు పట్టణంలో కూటమి ప్రభుత్వం గెలిచిన సంవత్సరం తిరగ కుండానే కందుకూరు అభివృద్ధికి అధికారులు శ్రీకారం చుట్టారు. దీంతో గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నా గెలిచిన ఏ నాయకుడు సమస్య పరిష్కారానికి ముందడుగు వేయలేదని అయితే కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు మాత్రం కందుకూరు అభివృద్దే నాకు ముఖ్యం అని, ప్రజల శ్రేయస్సు కోసం ముందుకు సాగటం కందుకూరుకు మహర్దశ మొదలైందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే బాటలో కందుకూరు లో ట్రాఫిక్ ఉన్న ముఖ్య ప్రదేశాలలో కూడా ఆక్రమణలు తొలగిస్తే కందుకూరు సుందరీకరణం తద్యమని పలువురు తెలుపుతున్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)