వీరయ్య మృతదేహాన్ని చూసి బోరున విలపించిన ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్
BSBNEWS - ONGOLE
మంగళవారం సాయంత్రం ఒంగోలులో హత్యకు గురైన నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముప్పువరపు వీరయ్య చౌదరి మృతదేహాన్ని చూసి కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ బోరున విలపించారు. వీరయ్య చౌదరితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని బాదాప్త హృదయాలయ్యారు. ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ నందు వీరయ్య మృతదేహానికి డాక్టర్ శ్రీకాంత్ నివాళులర్పించారు. వీరయ్య మృతి తెలుగుదేశం పార్టీ కి తీరని లోటని అన్నారు. తన ఆప్త మిత్రుణ్ణి కోల్పోవడం ఎంతో బాధ కలిగించింది అని అన్నారు. వీరయ్యను హత్య చేసిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షిమస్తుందని అన్నారు.