సిద్ధార్థ వారి ఆణిముత్యం అనుమాల. వర్ష
BSBNEWS - కందుకూరు
బుధవారం విడుదల చేసిన 10 వ తరగతి పరీక్షలలో పట్టణంలోని సిద్ధార్థ విజయభేరి మోగించింది అని సిద్ధార్థ విద్యాసంస్థల కరస్పాండెంట్ జి రామారావు అన్నారు. ఈ సందర్భంగా 600 మార్కులకు గాను 592 మార్కులు సాధించిన సిద్ధార్థ ఆణిముత్యం అనుమాల. వర్షను సిద్ధార్థ విద్యాసంస్థల కరస్పాండెంట్ జి రామారావు, సిద్ధార్థ పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరిబాబు, అధ్యాపక బృందం అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 550 కి పైగా మార్కులు సాధించిన మా ఆణిముత్యాలు 22 మంది అని, 500 కి పైగా మార్కులు సాధించిన మా విద్యార్థులు 36 మంది అని, ప్రతి ఇద్దరిలో ఒక్కరు 500 కు పైగా మార్కులు సాధించారన్నారు. విద్యార్థులందరికీ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. ఈ సంవత్సరం మా విద్యార్థులు సాధించిన విజయం మమ్మల్ని ఎంతో సంతోషానికి గురి చేసిందన్నారు. వారి యొక్క అకుంఠిత దీక్ష, క్రమశిక్షణ, మా సిబ్బంది యొక్క నిరంతర ప్రోత్సాహం ఈ అద్భుతమైన ఫలితాలకు కారణమయ్యాయన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి తమ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకుని విజయపథంలో పయనించడం మాకు గర్వకారణం. అని అన్నారు. సిద్ధార్థ విద్యాసంస్థలు భవిష్యత్తులో కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, వారి విజయానికి తోడ్పాటునందిస్తుందని తెలియజేస్తున్నామన్నారు. విజయం సాధించిన విద్యార్థులందరికీ మా హృదయపూర్వక అభినందనలు అని అన్నారు.