నృసింహ సేవలో ఎమ్మెల్యే కుటుంబం
జయంతి ఉత్సవాలకు చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య దంపతులు
భక్తులకు అందుతున్నసౌకర్యాలపై స్వయంగా పర్యవేక్షిస్తున్నఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
వలేటివారిపాలెం BSBNEWS
మాలకొండ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి జయంతి ఉత్సవాలు సందర్భంగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు, నియోజకవర్గం లోని ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని కోరుకున్నారు. వేకువజామున దర్శన భాగ్యం అనంతరం భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆయనే స్వయంగా పరిశీలించారు. భక్తుల సౌకర్యాలు ఏర్పాట్ల విషయంలో అధికారులు అశ్రద్ధ వహించవద్దని సూచించారు. సాంప్రదాయిక దుస్తుల్లో భక్తులను పలకరిస్తూ ఎమ్మెల్యే ఇంటూరి ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు. జయంతి ఉత్సవాలు సందర్భంగా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అల్పాహార శాల వద్ద భక్తులకు ఏర్పాటు చేసిన పలహారాన్ని ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి వితరణ చేశారు