నూతన బస్ సర్వీస్ ను స్వయంగా నడిపి ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
BSBNEWS - కందుకూరు
పట్టణంలోని ఆర్టీసీ డిపో నందు నూతనంగా కందుకూరు నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం నకు బస్ సర్వీస్ ను సోమవారం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు..ముందుగా బస్ సర్వీస్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి ఆర్టీసీ అధికారులు, తెలుగునాడు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానానికి నడుపుతున్న ఈ నూతన బస్ సర్వీసును ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్, ఆర్టీసీ అధికారులు, కందుకూరు మండలం పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య, తెలుగు నాడు యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.