కార్యకర్తలే టిడిపికి అండ

0

 కార్యకర్తలే టిడిపికి అండ

సమాజమే దేవాలయం... ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో స్థాపించిన పార్టీ తెలుగుదేశం

దేశానికి సంక్షేమం పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్

BSBNEWS - కందుకూరు 




తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అండ కార్యకర్తలు ఏ స్థాయిలో ఉన్న వారిని విస్మరించేది లేదని వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. పట్టణంలోని తిరుమల కళ్యాణ మండపంలో సోమవారం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కందుకూరు నియోజకవర్గం స్థాయిలో మినీ మహానాడు కార్యక్రమాన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పార్టీ నాయకులు కార్యకర్తలు తో కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీలో వివిధ కారణాలతో చనిపోయిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రద్ధాంజలి ఘటించారు. ఇటీవల పెహల్గాం ఉగ్రవాదులు దాడులలో చనిపోయిన వారికి,  పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో అమరవీరులైన సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టిడిపి పార్టీ ఆవిర్భవించి 43 ఏళ్లు అయిందని, అందులో 23 సంవత్సరాలు అధికారంలో ఉన్నామంటే దాని వెనుక కార్యకర్తల కృషి  మరువలేనిదని ఆయన తెలిపారు. కందుకూరు నియోజకవర్గంలో తనను ఎమ్మెల్యేగా గెలిపించిన   పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని,  కందుకూరు నియోజకవర్గ అభివృద్ధికి, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కృషి చేస్తానని అదేవిధంగా 2029 సంవత్సరం లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయటమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనివిధంగా కోటి సభ్యత్వాలు తో రికార్డు సృష్టించామన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కృషి చేస్తుందని, కార్యకర్తల కోసం ప్రమాద బీమా రెండు లక్షల నుంచి ఐదు లక్షల పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని తెలిపారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని కొనియాడారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలలోనే అధికారంలోకి వచ్చి తెలుగు వారి సత్తా ఏంటో ఢిల్లీకి చూపించామన్నారు. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసామని ఎన్నో సంక్షోభాలు చూసామని ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన జెండా దించకుండా పార్టీకి కాపు కాసింది పార్టీ కార్యకర్తలని ఆయన తెలిపారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్ అని అన్నారు. అదే దేశానికి అభివృద్ధి అంటే ఏంటో చూపించింది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తెలిసేలా చేసింది అన్న ఎన్టీఆర్ అని, అయితే తెలుగువారిని ప్రపంచ పటంలో పెట్టింది పార్టీ అధినేత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని ఆయన పేర్కొన్నారు. ముందుగా కందుకూరు నియోజకవర్గంలోని 7 ప్రధాన సమస్యలతో  తీర్మానాలను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదించిన తీర్మానాలను కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించి  ఈనెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడులో తీర్మానాలను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య, జనిగర్ల నాగరాజు, మాదాల లక్ష్మీనరసింహం, రాచగర్ల సుబ్బారావు, పట్టణ మాజీ టిడిపి అధ్యక్షులు కండ్రా మాల్యాద్రి, పిడికిడి వెంకటేశ్వర్లు, పార్టీ  నాయకులు ఉప్పుటూరి శ్రీనివాసరావు, ఉన్నం వీరాస్వామి , చదలవాడ కొండయ్య, షేక్ రఫీ, చిలకపాటి మధుబాబు, నాదెళ్ల వెంకట రమణయ్య, గొట్టిపాటి హరికృష్ణ, కూనం నరేంద్ర, వడ్డెళ్ళ రవిచంద్ర, ముచ్చు శ్రీనివాసరావు నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు, గ్రామ, వార్డు పార్టీ అధ్యక్షులు కందుకూరు పట్టణ ప్రధాన కార్యదర్శి కల్లూరి శైలజ, మండల మహిళా అధ్యక్షురాలు మన్నం శైలజ, మహిళా నాయకులు అల్లం సుమతి మహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)