చంద్రబాబు నాయుడుకి రైతులు అంటే చులకన భావం

0

 చంద్రబాబు నాయుడుకి రైతులు అంటే చులకన భావం

- మద్దతు ధర ప్రకటించి పొగాకు రైతన్నను ఆదుకోవాలి

- బుర్రా మధుసూదన యాదవ్

BSBNEWS - కందుకూరు 





కందుకూరు నియోజకవర్గం లోని పొగాకు సాగు చేసిన రైతులు పక్షాన ఎంతవరకైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని మాజీ శాసనసభ్యులు వైయస్సార్ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ తెలిపారు.రైతు పండించిన పొగాకు పంటకు సరైన మద్దతు ధర కల్పించాలని కోరుతూ శుక్రవారం పట్టణంలోని 27 పొగాకు బోర్డు వేలం కేంద్రం రెండులో వేలం తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా బుర్ర మధుసూదన్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ గత సీజన్లో అత్యధిక రేటు పలికిన పొగాకు పంట కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వలన కనీస మద్దతు ధర కూడా నేడు పలకటం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రైతులు అంటే చులకన భావం ఉందని అన్నారు. రైతుకు పెట్టుబడి సాయం చేయకపోగా కనీస గిట్టుబాటు ధరను కూడా కల్పించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. నెల్లూరు జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యధికంగా సాగు చేసిన పొగాకు రైతులను నిట్ట నిలువునా ముంచేసే విధంగా కూటమి ప్రభుత్వ విధానాలు, చర్యలు ఉన్నాయన్నారు. అధిక పెట్టుబడులు, భారమైన  కౌలు రేట్లు, బ్యారనీ బాడుగలు  రైతు నడ్డి విరుస్తున్నందున రైతులకు మద్దతుగా ప్రభుత్వం ఆదుకునే చర్యలు ఏమాత్రం చేపట్టటం లేదన్నారు. ఈ సీజన్లో పొగాకు పంట పరిమితిని పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది తప్ప సరైన వేలం ధరను రైతుకు కల్పించలేక పోతుంది అని విమర్శించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి రైతు  సంక్షేమ విధానాల వలన ఇదే సీజన్లో అత్యధిక రేటు పలికింది అని, రైతులకు మంచి లాభాలు వచ్చాయన్నారు. ప్రస్తుతం పొగాకు మార్కెట్లో పలుకుతున్న ధరల వల్ల ఈ ఏడాది బ్యారెన్ కు రెండు నుంచి మూడు లక్షల వరకు నష్టం వచ్చే అవకాశం ఉందని రోజురోజుకు రేట్లు పతనమవుతున్నందున తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకొని పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు సంస్థలతో పాటు ప్రభుత్వ సహకార సంస్థ కూడా వేలంపాటలో పాల్గొని రైతులకు మేలు చేసే విధంగా ధరలు స్థిరీకరించాలని వేలం అధికారికి వినతి పత్రం ఇచ్చి కోరారు. మార్కెట్లో ధరలు వచ్చేవరకు సరుకును కోల్డ్ స్టోరేజీలలో భద్ర పరుచుకునేందుకు అనుగుణంగా రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వమే కోల్డ్ స్టోరేజీలను ఈ ప్రాంతంలో నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని పొగాకు రైతుల పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించాలి అని లేకపోతే అనేక మంది రైతుల బ్రతుకులు ఆర్థికంగా చితికి పోయి రోడ్డుపాలు అవుతాయని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. వేలం పాట ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్ ఒకే రేటు పై నడుస్తుందని బయర్లు ఏమాత్రం ధరలు పెంచడం లేదని సిండికేట్ గా ఏర్పడి రైతులను దెబ్బతీస్తున్నారని అనేకమంది రైతులు నా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు అని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి న్యాయం చేయాలి లేనిచో  రైతుకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి పోరాటం చేస్తుందన్నారు. జిల్లాలో పొగాకు రైతులతో పాటు మిర్చి, కంది రైతులకు కూడా మద్దతు ధర రాక విలవిలలాడి పోతున్నారని బాధిత రైతులకు అండగా వైఎస్ఆర్సిపి నిలబడి మద్దతు ధర సాధించే వరకు వారితో కలిసి పోరాడుతుందని అన్నారు. అవసరమైతే రైతులకు మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని పిలిపించి రైతు సోదరులకు అండగా ఆందోళన చేపడతామని తెలిపారు. ముందుగా వేలం కేంద్రాన్ని సందర్శించి ధరల గురించి రైతులతో వాకబు చేశారు. వేలం అధికారితో మాట్లాడుతూ సమస్య తీవ్రతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షులు నల్లమోతు చంద్రమౌళి, రైతు విభాగం మండల అధ్యక్షులు గోగినేని రామాంజనేయులు, జిల్లా జనరల్ సెక్రెటరీ తోకల కొండయ్య, జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు కిషోర్, జిల్లా సెక్రెటరీ చీమల వెంకటరాజా, బూత్ కమిటీ రాష్ట్ర నాయకులు గణేశం గంగిరెడ్డి పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ, వివిధ మండలాల అధ్యక్షులు ఈదర రమేష్, అనుమాల లక్ష్మీనరసింహం, నోటి వెంకటేశ్వర్ రెడ్డి, నన్నం పోతురాజు, ఎంపీపీ పెన్నా కిష్టయ్య, మేధావుల సంఘం జిల్లా అధ్యక్షులు రావులకొల్లు బ్రహ్మానందం, కల్చర్ వింగ్ జిల్లా అధ్యక్షులు కంపరాజు సాంబశివరాజు, ఐటీ వింగ్ అధ్యక్షులు పాలవల్లి అమరనాథరెడ్డి గోపాలపురం సర్పంచి కొత్త రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)