మూడో రోజుకు చేరిన వైద్యశాల పారిశుద్ధ కార్మికుల నిరసన
- హాస్పిటల్ సూపరిండెంట్ హామీతో నిరసనను విరమించిన కార్మికులు
BSBNEWS - కందుకూరు
మాకు వేతనాలు వేయండి అంటూ కందుకూరు గవర్నమెంట్ హాస్పిటల్ పారిశుధ్య కార్మికులు గత మూడు రోజుల నుండి నిరసన చేపట్టారు. పారిశుద్ధ్య కార్మికులు మాట్లాడుతూ మాకు 3 నెలల నుండి జీతాలు వేయటం లేదని నాలుగు సంవత్సరాల వరకు రావాల్సిన పి ఎఫ్ ఇవ్వటం లేదని మావి చాలీచాలని బ్రతుకులని మేము వేతనాలతోనే నా కుటుంబాలను పోషించుకుంటున్న పరిస్థితులని వెంటనే మాకు జీతాలు ఇవ్వాలని వారు తెలిపారు. అనంతరం సూపర్డెంట్ డాక్టర్ శకుంతల మీకు జీతాలు వేయించే బాధ్యత మాది అని, మీకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో పారిశుద్ధ్య కార్మికులు నిరసన కార్యక్రమాన్ని విరమించారు. వైద్యశాల సూపరిండెంట్ డా.శకుంతల మీడియాతో మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సమస్యను కాంట్రాక్టర్ తో మాట్లాడటం జరిగిందని 15వ తేదీ వరకు వారికి వేతనాలు వేయడం జరుగుతుందని, వేతనాలతో పాటు వాళ్లకి రావలసిన పిఎఫ్ ను వారికి వచ్చేలా చూస్తామని తెలిపారు. వైద్యశాలలో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఏఐటియుసి నియోజకవర్గం కార్యదర్శి వై ఆనంద మోహన్ మాట్లాడుతూ కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని వాటితో వారికి వేతనాలు రాకపోవడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సత్వరమే వారికి పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని వారికి రావాల్సిన పిఎఫ్ బకాయిలను సైతం వెంటనే వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇచ్చిన సమయంలో వారికి వేతనాలు రాకపోతే కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగుతామని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి అధ్యక్షులు కే.మురళి తదితరులు పాల్గొన్నారు.