పొగాకు రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి
- ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
BSBNEWS - కందుకూరు
ఒంగోలు ప్రకాశం భవన్ లో కలెక్టర్ తమీమ్ అన్సారియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్, పొగాకు బోర్డు ఈడీ, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, రైతులతో కలిసి పొగాకు రైతు సమస్యలపై సోమవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గంలో రైతులు పొగాకు పంట ఎక్కువగా సాగు చేస్తుంటారు అని, గత సంవత్సరం పొగాకు ధరలతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా తక్కువగా ఉన్నాయని, ఈ సంవత్సరం రైతు పెట్టుబడులు భారీగా పెరగటం వలన, ధరలు ఆశాజనకంగా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. పొగాకు బోర్డు, ప్రభుత్వం పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని రైతులు తరఫున ఆయన కోరారు.