హరిచంద్ర కాటిసీనుకు జీవం పోస్తున్న చలంచర్ల సుబ్బారావు

0

హరిచంద్ర కాటిసీనుకు జీవం పోస్తున్న చలంచర్ల సుబ్బారావు

BSBNEWS - కందుకూరు 

నాటకాలు, నాటక రంగం పూర్తిగా కనుమరుగు అయిపోతున్న నేటి సమాజంలో నాటకరoగంలో అడుగుపెట్టి కందుకూరు ప్రాంతంలో కాటిసీను హరిచంద్రుడిగా రాణిస్తూ సత్య హరిచంద్ర కాటిసీనుకు చలంచర్ల సుబ్బారావు జీవం పోస్తున్నారు. మనందరికీ ఆప్తుడైన చలంచర్ల సుబ్బారావు, ప్రముఖ రంగస్థలం కళాకారులు హరిచంద్ర పాత్రధారి వేటపాలెం వాస్తవ్యులు కీర్తిశేషులు డివి సుబ్బారావుకి ఏకలవ్య శిష్యుడుగా హరిచంద్ర నాటకంలోని కాటిసీను అచ్చుగుద్దినట్టుగా డివి సుబ్బారావు బాణీలతో ప్రేక్షకుల మదిలో డివి సుబ్బారావు మళ్లీ బ్రతికి వచ్చినట్లుగా పద్యాలను ఆలపిస్తూ కళాభిమానుల హృదయాలను తన కంఠస్వరంతో చూరగొంటున్నారు. ఈ సందర్భంగా చలంచర్ల సుబ్బారావు మాట్లాడుతూ తను కళాకారుడుగా ఎదగటానికి కళాభిక్షను ప్రసాదించిన తన గురువు ఏసుదాస్( దండోరా దాస్ ) ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. పౌరాణిక నాటక రంగంలో తొలిసారిగా తనను హరిశ్చంద్రుడుగా నాటక రంగానికి పరిచయం చేసిన మరొక గురువు జక్కుల మాలకొండయ్య కు రుణపడి ఉంటాను అని, తనను కళాపరంగా ప్రోత్సహిస్తున్న ఆయన మిత్రులు అందరకు రుణపడి ఉంటానని, బుల్లితెరకు తనను పరిచయం చేసి అమృతం సీరియల్ లో నటింపజేసిన ఇంటూరు వాసుకి రుణపడి ఉంటానని ఆయన తెలియజేశారు. కందుకూరు ప్రాంత నివాసి వృత్తి రీత్యా ప్రభుత్వ ఉద్యోగి అయిన మన చలంచర్ల సుబ్బారావు కళాకారుడుగా ఇంకా ఎంతో ఎదగాలని ఆయన మిత్రులు కళాభిమానులు కోరుకుంటున్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)