నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే ఇంటూరి
BSBNEWS - కందుకూరు
పట్టణంలోని 3వ వార్డు ఉప్పుచెరువులో నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు రెబ్బవరపు మాల్యాద్రి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో సోమవారం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గృహప్రవేశ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి మాల్యాద్రి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, పార్టీ నాయకులు చదలవాడ కొండయ్య, గోచిపాతల మోషే, యర్రా ముసలయ్య, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.