సిపిఐ మహాసభలను జయప్రదం చేయండి
దామా అంకయ్య
BSBNEWS - నెల్లూరు
ఈనెల 17,18,19 తేదీలలో నెల్లూరు నగరంలో జరిగే సిపిఐ జిల్లా మహాసభలను ఆగస్టు 20 నుంచి 25 వరకు ఒంగోలులో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య పిలుపునిచ్చారు. సిపిఐ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో దామా అంకయ్య మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఒక చరిత్ర కలిగినటువంటి పార్టీ దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని దేశం కోసం ప్రాణార్పణ చేసినటువంటి పార్టీ ఎన్నో పోరాటాల ద్వారా ప్రజల పక్షాన ఉండే పార్టీ భారతదేశంలో పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తిచేసుకుని ఒక నిర్మాణ పరంగా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్న ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో భాగంగా ప్రతి మూడు సంవత్సరాలకు శాఖ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర మహాసభలు జరుపుకోవడం నిర్మాణపరంగా జరుగుతుందన్నారు. అందులో భాగంగా ఈనెల 17, 18,19 తేదీ నెల్లూరు నగరంలో కోటమిట్ట
షాదీ మంజిల్ లో జిల్లా మహాసభలు జరుగుతాయని,ఈ జిల్లా మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ,రైతు సంఘం జాతీయ కార్యదర్శి రావుల వెంకయ్య,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్, ఈశ్వరయ్య,హరినాథ్ రెడ్డి,
ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటసుబ్బయ్యలు పాల్గొంటారన్నారు.ఈ సందర్భంగా 17వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు నెల్లూరు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గల మహబూబ్ ఖాన్ పార్కు వద్ద నుండి ప్రదర్శన బయలుదేరి కోటమిట్ట షాది మంజిల్ వరకు జరుగుతుందని,అనంతరం షాదీ మంజిల్లో బహిరంగ సభ జరుగుతోందన్నారు.అలాగే 18వ తేదీ ప్రతినిధుల సభ జరుగుతుందని అంకయ్య తెలిపారు.సిపిఐ28 వ రాష్ట్ర మహాసభలు ఒంగోలు నగరంలో జరుగుతాయని ఈ సందర్భంగా 23వ తేదీ బహిరంగ సభ ప్రదర్శన జరుగుతోందని కావున జిల్లా రాష్ట్ర మహాసభలలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని దామాంకయ్య విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్ సిరాజ్,మధు,షానవాజ్,మహిళా సంఘం నాయకురాలు శిరీష, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.