ఇంటూరిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన పిఎసిఎస్ చైర్మన్లు
BSBNEWS - కందుకూరు
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీలను నియమించింది. ఒక్కో పిఎసిఎస్ కు ఒక చైర్మన్, మరో ఇద్దరిని డైరెక్టర్లుగా నియమించింది. ఈ సందర్భంగా గుడ్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) చైర్మన్ గా ఎంపికైన దామా వెంకటేశ్వర్లు, పోకూరు పిఎసిఎస్ చైర్మన్ ఘట్టమనేని లక్ష్మీనరసింహం, దారకానిపాడు పిఎసిఎస్ చైర్మన్ గా నరాల మాలకొండరెడ్డి లు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుని బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో తమను సొసైటీ చైర్మన్లుగా నియమించేందుకు సహకరించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అడుగుజాడల్లో నడుస్తూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు మేలు చేయడంతో పాటు పి ఎస్ సి ఎస్ లను అభివృద్ధి పథంలో నడిపించాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో గుడ్లూరు మండల టిడిపి అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, వలేటివారిపాలెం మండల టిడిపి అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, టిడిపి నాయకులు ఉన్నం వెంకటేశ్వర్లు, రావూరి వేణు, పువ్వాడి వేణు, మేకపోతుల రాఘవయ్య, రావూరి వేణు, చెన్నారెడ్డి మహేష్, మేకల మాల్యాద్రి, అత్తంటి శ్రీనివాసులు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


.jpeg)
.jpeg)