మానసిక దివ్యాంగులకు ఆహారం పంపిణీ
BSBNEWS - కందుకూరు
కాకు తిరిపాలమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు కాకు కిరణ్ బాబు కందుకూరు పట్టణంలో కోవూరు రోడ్డు నందు స్వర్ణ స్వయంకృషి మానసిక దివ్యాంగుల పాఠశాలలో బుధవారం దివ్యాంగులకు ఆహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆర్య వైశ్య మీడియా చైర్మన్ చక్కా వెంకట కేశవరావు మాట్లాడుతూ పెద్దవారిని స్మరించుకునేటప్పుడు సేవా కార్యక్రమం చేయడం ఎంతో మంచి కార్యక్రమం అని అన్నారు. విద్యార్థి వయసు నుంచి సేవా కార్యక్రమాలు అలవర్చుకోవడం మంచి లక్షణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కిరణ్ స్నేహితులు చక్కా చైతన్య గుప్తా నరేష్, నజీర్, సమీర్, తదితరులు పాల్గొన్నారు.