పిజిఆర్ఎస్ లో ప్రజల నుండి అర్జీలు స్వీకరణ
BSBNEWS - కనిగిరి
పిజిఆర్ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) అమలులో భాగంగా ప్రకాశం జిల్లా, కనిగిరి డివిజన్ కు సంబంధించి సోమవారం ఉదయం కనిగిరిలోని పవిత్ర ఫంక్షన్ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమంలో కనిగిరి, మార్కాపురం శాసన సభ్యులు డా ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, కందుల నారాయణరెడ్డి, కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గపూర్, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఆర్డిఓ కేశవర్ధన్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, పార్థసారథి, జాన్సన్ లతో కలసి జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల ముందు వచ్చిన అర్జీలను పరిశీలించి త్వరతిగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా లోని అన్నీ శాఖల జిల్లా అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.