దామచర్ల ఆంజనేయులు మంత్రి డా.స్వామి నివాళులు

0

 దామచర్ల ఆంజనేయులు మంత్రి డా.స్వామి నివాళులు


BSBNEWS - టంగుటూరు




తూర్పు నాయుడు పాలెంలో దామచర్ల ఆంజనేయులు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు మంత్రి డోలా వీర బాల వీరాంజనేయ స్వామి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీతి,నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనం దామచర్ల ఆంజనేయులు అని కొనియాడారు. దామచర్ల ఆంజనేయులు పార్టీకి, ఈ ప్రాంత ప్రజలకు 

చేసిన సేవలు వెలకట్టలేనివి అని అన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కొండపి నియోజకవర్గ అభివృద్ధిపై చెరగని ముద్ర వేశారు అని గుర్తు చేశారు. దేవాదాయ శాఖ, మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రిగా దేవాలయాల అభివృద్ధికి,రైతుల సంక్షేమానికి పాటుపడ్డారన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)