వినాయకుడిని దర్శించుకున్న టిడిపి పట్టణ మాజీ అధ్యక్షులు
BSBNEWS - KANDUKUR
పట్టణంలోని కొత్తపాలెం కృష్ణ బలిజ సంఘం యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాలలో భాగంగా నాల్గవ రోజు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో టిడిపి పట్టణ మాజీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పిడికిటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కృష్ణ బలజ సంఘం వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఐక్యమత్యంగా కలిసి వినాయకుడిని ఏర్పాటు చేసుకొని ఘనంగా పండుగను నిర్వహించుకుంటున్నారని అన్నారు. తమ సొంత నిధులతో కలిసికట్టుగా తారతమ్యాలు లేకుండా రాముల వారి దేవస్థానంను నిర్మించుకొని వారి వారి కార్యక్రమాలను నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. వారి అభ్యున్నతకు టిడిపి ప్రభుత్వం ఎప్పుడు వారికి తోడుగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ బలిజ సంఘం కమిటీ నిర్వాహకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

