వినాయకుని నిమజ్జనం ఊరేగింపును పర్యవేక్షించిన సీఐ
BSBNEWS - KANDUKUR [12/9/24]
వినాయక చవితి అయిదవరోజు నిమజ్జనం సందర్భంగా పట్టణంలో పలు వినాయక విగ్రహాలను కందుకూరు సిఐ కె. వెంకటేశ్వరరావు పర్యవేక్షించి యువతకు పలు సూచనలు చేశారు. అందులో భాగంగా పట్టణంలోని 14 వ వార్డు కొత్తపాలెం కృష్ణ బలిజ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన వినాయకుని నిమజ్జనం సక్రమంగా నిర్వహించాలని అన్నారు. నిమజ్జనం అందరికీ కోలాహలంగా ఉండాలి తప్ప ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ఆవిధిగా కమిటీ నిర్వాహకులు చూసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆయన అన్నారు. పట్టణంలో వినాయకుని పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంతో వినాయకుడిని ప్రతిష్టిస్తారని ప్రతి ఒక్కరూ దానిని ఒక పండుగ చేసుకోవలె తప్ప ఎటువంటి అవంతరాలు జరగకుండా చూసుకుంటే అందరూ సంతోషంగా ఉంటారని ఆయన అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎటువంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా నియమ నిబంధనలు పాటిస్తూనిమర్జనం చేసుకుంటే అందరికీ మంచిదని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

