శామీర్ పాలెంలో పోషన్ మహా
BSBNEWS - KANDUKUR [12/9/24]
కందుకూరు మండలంలోని శామీర్ పాలెం అంగన్వాడి కేంద్రంలో సూపర్వైజర్ యు. ప్రభావతి ఆధ్వర్యంలో పోషణ్ మహా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిడిపిఓ శర్మిస్ట ఆదేశాల మేరకు పోషణ్ మహా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క తల్లి తమ పిల్లలు పౌష్టికాహారంగా ఉండాలని కోరుకుంటారని వారి కోరిక మేరకు ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషక ఆహారాన్ని అందిస్తుందని వాటిని గర్భవతులు బాలింతలు తీసుకొని తమ పిల్లలు పౌష్టికాహారంగా ఉండేలా జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. పౌష్టికాహార లోపం లేని చిన్నారులను తయారు చేయటమే అంగన్వాడి కేంద్రాల యొక్క ముఖ్య లక్ష్యం అని అందుకు ప్రతి అంగన్వాడీ కార్యకర్త తమ బాధ్యతను నిర్వర్తిస్తుందని వారికి గర్భవతులు, బాలింతలు, తల్లులు, ప్రజలు సహకరించాలని కోరారు. పిల్లల్లో ఎదుగుదల ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన పౌష్టికాహార విషయంలో చాలామంది వెనుకడుగులో ఉన్నారని వారు అంగన్వాడీ కేంద్రాల ద్వారా నిర్వహించే అవగాహన కార్యక్రమంలో పాల్గొని అంగన్వాడీ కార్యకర్తలు చెప్పిన విధంగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఎస్సే హసీనా, ఎం. సుభాషిని, ఆనందపురం అంగన్వాడి కార్యకర్తలు, తల్లులు ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

