కులగనన చారిత్రక అవసరం : సిపిఐ నెల్లూరు జిల్లా సహాయకార్యదర్శి పి.మాలకొండయ్య

0

కులగనన చారిత్రక అవసరం : సిపిఐ నెల్లూరు జిల్లా సహాయ కార్యదర్శి పి.మాలకొండయ్య

BSBNEWS - KANDUKUR [10/9/24]  

కులగణన చారిత్రక అవసరమని సిపిఐ నెల్లూరు జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ పి.మాలకొండయ్య అన్నారు.బుధవారం కందుకూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మధ్య జరిగిన పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయా రాజకీయ పార్టీలు వాటి ఎన్నికల మేనిఫెస్టోలో కుల గణన జరిగి తీరాల్సిందేనని పొందుపరిచి ఉన్నారు. కులం ఒక సామాజిక వాస్తవం అయినప్పుడు.. దాని లెక్కలు తీయటానికి ఇబ్బందులు ఏమిటి అని ప్రజలలో వచ్చే చైతన్యం ఉద్యమాలకు దారి తీయబోతుంది. బీహార్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అనుమతించనప్పటికీ కుల గణన జరిపి దాని వివరాలు సెప్టెంబరు  రెండవ తేది బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. బీహార్ రాష్ట్రంలో 64% బీసీలు ఉన్నట్లు లెక్క తేలింది. తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర చట్టసభలలో తీర్మానం చేసి కేంద్రానికి పంపటం మంచి పరిణామం. భారత ఉపఖండంలో వేలాది కులాలతో నిండి ఉంది. ఆంగ్లేయుల పాలనలో జనగణన 1881 నుండి జరిగినట్లు తెలుస్తుంది. అందులో 1931 వరకు కుల కులగణన జరిగింది. 1941 కులగణన జరిగిన రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా బహిర్గతం కాలేదు. 1947 నుండి జనగణన జరుగుతుంది. వివిధ కులాలతో ఉన్న భారతదేశం ఏ కులంలో ఎంత అభివృద్ధి సాధించింది.. ఏ ఏ రంగాలలో ఎంత వెనుకబడి ఉన్నారో తెలియకుండా పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యం కాదు. కాబట్టి తప్పక కులగణన చేసి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో వారి కులాల ఆధారంగా వాళ్లకి ప్రయోజనాలు చేకూర్చాలి. ఎస్సీ, ఎస్టీ కులగణన తీస్తున్నారు. బీసీలకు 1931దే చివరి లెక్కలు ఆధారంగానే ప్రస్తుతం అమలు జరుపుతున్న రిజర్వేషన్లు గాని, సంక్షేమ కార్యక్రమాలు గాని, అమలు జరుగుతున్నాయి. 1955, 1980, 2005, 2006 నాటి జాతీయ కమీషన్లు కులగణన అవసరాన్ని నొక్కి చెప్పారు. భారతదేశంలో 3743 బీసీ కులాలు ఉన్నట్లుగా లెక్కలు చెప్తున్నారు. వాటి కులగణన చేయటం పెద్ద కష్టమేమీ కాదు. కాలేల్కర్  కమీషన్ 1990 లో, మండల కమీషన్ కులగణన ప్రస్తావించాయి. 2006లో సామాజిక న్యాయం మీద సుమిత్ర మహాజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన స్టాండింగ్ కమిటీ కులగణన చేయాలని చెప్పింది. 2008లో ప్లానింగ్ కమిషన్ కులగణన చేయాలని చెప్పింది. 2010లో బిజెపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కులగణన చేయాల్సిందేనని చెప్పి ఇప్పుడు వెనక్కి తగ్గటం సమంజసం కాదు. 2014 ఆగస్టు 1న లోక్ సభలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను ప్రభుత్వ ఆర్థిక సహాయ శాఖ మంత్రి తెలిపిన వివరాల ప్రకారం 30 లక్షల 84 వేల 530 మంది వీరిలో బీసీ ఉద్యోగుల సంఖ్య సుమారు 11% లోపు చాలా తక్కువ అని తెలుస్తుంది. భారత రాష్ట్రపతి సెక్రటేరియట్ గ్రూప్ ఎ ఆఫీసర్ల సంఖ్య ఒక్కరు కూడా బీసీలు లేరు. యూపీఎస్సీ వారు నియమించిన సిబ్బందిలో 651మందిలో తొమ్మిది శాతం మాత్రమే బీసీ ఉద్యోగులు ఉన్నారు. ఐఐటి బొంబాయి టీచింగ్ ఫ్యాకల్టీ దాదాపు 500 మందిలో ఐదుగురు మాత్రమే బీసీలు ఉన్నారు.పేరొందిన పబ్లిక్ రంగ సంస్థ గెయిల్ అత్యున్నత మేనేజ్మెంట్ స్థాయిలో 92 మంది ఉద్యోగులు ఉంటే కేవలం ముగ్గురు మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు. దీనినిబట్టి కేంద్ర ప్రభుత్వ సర్వీస్ లలో సామాజిక న్యాయం  ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఈమధ్య కేరళ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ కులగణన తీయాలని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలో కులగణన చేయాల్సినఅవసరం ఉన్నది. దీనికి తక్షణం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం, బిజెపి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కులగణన చేయవలసిన అవసరం ఉంది. సామాజిక న్యాయం అమలు జరపాలంటే ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో జనాభా నిష్పత్తి ప్రకారం ఆయా కులాలకి వాటా ఇవ్వాలి. ఉదాహరణకి ఆంధ్ర రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 90 మంది బీసీలు ఉండాలి. అసెంబ్లీ మొఖం చూడని అనేక బీసీ కులాలకు సామాజిక న్యాయం వర్తింపచేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్థిక రంగంలో విద్య, వైద్యం, రియల్ఎస్టేట్, పరిశ్రమలు ఈ అన్ని కూడా కొద్దిమంది కార్పొరేట్ శక్తుల ఆధీనంలో కేంద్రీకృతమై ఉన్నాయి. కాబట్టి ఆర్థిక రంగంలో ఆయా కులాలను ప్రోత్సహించవలసి ఉంది.వీటన్నింటినీ సాధించటానికి కందుకూరులో అతి త్వరలో అన్ని కులాలతో కలిసి బీసీ సంఘం ఒక పెద్ద సదస్సును ఏర్పాటు చేయుటకు ప్రయత్నిస్తున్నాం.  దీనిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Post a Comment

0Comments
Post a Comment (0)