నిరుపేదకి ఇల్లు నిర్మిస్తున్న జనసేన పార్టీ నాయకులు

0

 నిరుపేదకి ఇల్లు నిర్మిస్తున్న జనసేన పార్టీ నాయకులు

దాతలకి ధన్యవాదాలు తెలిపిన జనసేన కనపర్తి మనోజ్ కుమార్

BSBNEWS - PONNALUR 10/9/24 

ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో పొన్నలూరు మండల కేంద్రం అంబేద్కర్ నగర్ లో మద్దిరాల ప్రసాద్ (తండ్రి పేరు లక్ష్మీ నరసింహం) అనే ఒక నిరుపేదకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇంటిని నిర్మిస్తున్నట్టు జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతనికి తల్లి తండ్రి భార్య పిల్లలు ఎవరూ లేరని, కూలి పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బులతో ఆరోగ్యానికి చూపించుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాడన్నారు. తండ్రి కాలంలో నిర్మించిన పూరిగుడిసే కూడా పడిపోవడంతో ప్రస్తుతానికి అతను గుడి దగ్గర, బడి దగ్గర పడుకుంటూ ఉన్నాడని అన్నారు. జనసేన పార్టీ నాయకులు ద్వారా విషయం నాకు తెలిసిందని, పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకొని మద్దిరాల ప్రసాద్ కి  రేకులతో ఇల్లు నిర్మించాలని జనసైనికులను, దాతలను కోరడం జరిగిందన్నారు. అందరూ స్పందించి ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పొన్నలూరు  టిడిపి నాయకులు మండవ మురళి, వెలగపూడి శ్రీనివాసులు, చుక్క జయకృష్ణ, మందల మల్లికార్జునలకి జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

Post a Comment

0Comments
Post a Comment (0)