మహాలయ అమావాస్యకి పేదలకు నూతన వస్త్రాలు, ఆహారం పంపిణీ

0

 మహాలయ అమావాస్యకి పేదలకు నూతన వస్త్రాలు, ఆహారం పంపిణీ

BSBNEWS -  KANDUKUR [2/10/24] 


ఆకలితో ఉన్న వారి ఆకలి తీరుద్దాం వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూద్దాం అనే నినాదంతో శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ(8341221414) కందుకూరు వారి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా పితృదేవతల పక్షం, మహాలయ అమావాస్య సందర్భంగా బుధవారం శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, దాతలందరి సహకారంతో వారి పితృదేవతల జ్ఞాపకార్థం శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ ఆదరణ అనాధ వ్రృద్ధాశ్రమంలో, ఏర్పేడు లక్ష్మీ నరసింహ మానసిక వృద్ధాశ్రమం, కందుకూరు స్వర్ణ స్వయంక్రృషి మానసిక వికలాంగుల ఆశ్రమం, కె.బి.ఆర్ ఫౌండేషన్ గుంటూరు, సంజీవిని అనాధ వృద్ధాశ్రమం గిద్దలూరు ఆశ్రమాలలోఉన్న వారికి అల్పాహారం , మధ్యాహ్నం, రాత్రి భోజనం ఏర్పాటు  చేయటం జరిగిందని శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు సేవా హృదయ డాక్టర్ రవ్వా శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందుకూరు పట్టణం వీధుల్లో తిరుగుతూ ఉండే యాచకులకు నిరాశ్రుయులకు నూతన వస్త్రములు, భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. విప్పగుంట రోడ్డులోని పేదలకు చీరలు, ఆహారం పంపిణీ చేయడం జరుగిందన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి సత్ర సముదాయాల మీడియా చైర్మన్ చక్కా వెంకట కేశవరవు,చీదెళ్ల కృష్ణ, మణికంఠ ,ఇన్నమూరి శ్రీనివాసులు,  బొమ్మశెట్టి శ్రీనివాసులు, గుర్రం అల్లూరయ్య, నల్లమల్లి ప్రసాద్,  కొంతమంది దాతలు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)