ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో టిడిపిలో చేరికలు

0

ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో టిడిపిలో చేరికలు

BSBNEWS - VALETIVARIPALEM


వలేటివారిపాలెం మండలం అంకభూపాలపురం గ్రామానికి చెందిన 6 కుటుంబాల వారు కందుకూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం వైసీపీ పార్టీకి రాజీనామా చేసి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో  తెలుగుదేశం పార్టీలో చేరారు. ముందుగా పార్టీలో చేరిన ప్రగడ మాలకొండయ్య, ప్రగడ నర్సింగరావు, ప్రగడ మాల్యాద్రి ప్రగడ మాధవ, నారాయణ వారందరికీ పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, యువ నాయకులు విద్యాశాఖ, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి తెలుగుదేశం పార్టీ ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని ఆయన తెలియజేశారు. పాత, కొత్త నాయకులు అందరూ కలిసి పార్టీ బలోపేతాని కృషి చేయాలని తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీలో  చేరిన వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,  కందుకూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై వైసీపీ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని భవిష్యత్తులో ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీలో కష్టపడుతూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి గ్రామంలో కృషి చేస్తామని పార్టీలో చేరిన నాయకులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, పార్టీ నాయకులు ప్రగడ శ్రీనివాసులు, ప్రగడ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)