అంగన్వాడి కేంద్రాలపై మండిపాటు
BSBNEWS (ఒంగోలు/సంతనూతలపాడు)
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకి, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు ఇండేల లక్ష్మీరెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని పిడతల గుడిపాడులో అంగన్వాడీ కేంద్రం - 1 ,2 లను ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్వాడీ సెంటర్ - 1 లో 9.గంటలకి రావలసిన పిల్లలు 10:30 అయిన కూడా పిల్లలు రావకపోవటం పై, కోడి గుడ్లు నిల్వ ఉండటం, రిజిస్టర్ లు సరిగా నిర్వహించకపోవటం వంటివి గుర్తించి అంగన్వాడీ టీచర్, సూపర్వైజర్ పై అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత సూపర్ వైజర్ సావిత్రికి షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. పిడతల గుడిపాడు సెంటర్ -2 లో విద్యార్ధుల హాజరు పట్టికను చూసి, తప్పుగా హాజరు వెయ్యటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంగన్వాడీ కేంద్రం పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇలా ఉంటే విద్యార్థులు వ్యాధుల బారిన పడే అవకాశం ఉందన్నారు. విద్యార్థులకి, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటే మీరు ఇలా చెయ్యటం పద్ధతి కాదని ఆయన చెప్పారు. సిడిపిఓ లు, సూపర్ వైజర్ లు నిరంతరం తనిఖీలు చేస్తూ అంగన్వాడీ కేంద్రాలను సక్రమంగా నిర్వహించేలా చూడాలన్నారు.
పిడతల గుడిపాడులో ఎం.పి.యు.పి.స్కూల్ లో వంటశాల పెచ్చులు ఉండటంతో ఏజెన్సీ వాళ్ల ఇంటిలో వంట వండటంతో ఆయన అసంతృప్తి చేస్తూ, రేపటి నుండి పాఠశాలలోనే వంట వండి తనకి ఫోటోలు పెట్టాలని ఆదేశించారు.
ఎర్రగుడిపాడులో
ఎర్రగుడిపాడు గ్రామంలో రెండు అంగన్వాడీ కేంద్రాల్లో తనిఖీ చేశారు. ఎస్.టి కాలనీ లోని అంగన్వాడీ కేంద్రం అసలు ఓపెన్ చెయ్యలేదని, ఎస్.సి కాలనీలోని కేంద్రాల్లో పిల్లలు లేరు, పిల్లలకి, బాలింతలకు ఇచ్చే ఆహారం ఒక్కటి కూడా లేదని ఈ విషయం పై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులని ఆయన ఆదేశించారు.
ఆయన వెంట సాంఘీక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్, డి.ఎస్.ఓ. పద్మశ్రీ, డీ.ఎం సివిల్ సప్లైస్ అధికారి వరలక్ష్మి, సమగ్ర శిక్ష జిల్లా బాలిక సంరక్షణ అధికారి కే.హేమలత ,తదితర అధికారులు ఉన్నారు.
