మాలకొండ దేవస్థానానికి రెండు కంప్యూటర్లు, కౌంటింగ్ మిషన్ అందజేత

0

మాలకొండ దేవస్థానానికి రెండు కంప్యూటర్లు, కౌంటింగ్ మిషన్ అందజేత

BSBNEWS - వలేటివారిపాలెం



శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధునికీకరణలో భాగంగా ఆలయ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా మార్చేందుకు యూనియన్ బ్యాంక్ తమ సామాజిక బాధ్యతలో భాగంగా రెండు నూతన కంప్యూటర్లను, డబ్బులు కౌంటింగ్ చేసే అధునాతన మిషన్ ను మంగళవారం రాత్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చేతుల మీదుగా ఆలయ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ విరాళాలు, లావాదేవీలు పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం అని, యూనియన్ బ్యాంక్ అందించిన కంప్యూటర్లతో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందుతాయి అన్నారు. నూతన కంప్యూటర్లను, కౌంటింగ్ మిషన్ అందజేసిన యూనియన్ బ్యాంక్ అధికారులను ఎమ్మెల్యే అభినందించారు. యూనియన్ బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ దేవస్థానం ఆధునికీకరణలో భాగం కావడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ డీజీఎం రవికుమార్, ఏజీఎం శ్రీనివాస్ సీనియర్ మేనేజర్లు సురేష్ రెడ్డి, హరికృష్ణ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)