రైతులు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను

0

 రైతులు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను

- 587 టీసీలు ఏకగ్రీవం కావడం చారిత్రాత్మకం 

- ప్రతి ఒక్క ఎకరాకు నీరు అందిస్తాం 

- కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

BSBNEWS - కావలి 

నియోజకవర్గ రైతులు, ప్రజలు తన పై, కూటమి ప్రభుత్వం పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో గెలిచిన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, టిసి మెంబర్లు శనివారం ఎమ్మెల్యే ను కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కలిసి సత్కరించారు. ఎన్నికల్లో గెలిచిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు. భారీగా విచ్చేసిన వారితో టిడిపి కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. పండుగ వాతావరణం కనిపించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి నియోజకవర్గం లో మేజర్ కాలువలు 8, మైనర్ చెరువులు 58, మీడియం కాలువలు 14 ఉన్నాయని, మొత్తం 588 టీసీలకు గాను 587 టిసిలకు ఎన్నికలు జరగడం జరిగిందని, 587 టిసిలు ఏకగ్రీవం కావడం జరిగిందన్నారు. 587 టీసీలు ఏకగ్రీవం కావడం కావలి నియోజకవర్గ చరిత్రలో చారిత్రాత్మక సంఘటన అని తెలిపారు. టిడిపి, బిజెపి, జనసేన పార్టీ అధిష్టానం పెద్దల ఆదేశాల మేరకు ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం జరిగిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా దూసుకుపోతున్న ఈ ప్రభుత్వం ఉండాలని, గ్రామ గ్రామాన ప్రజల్లో బలంగా కనిపిస్తుందని తెలిపారు. కాలువలను, చెరువులను అభివృద్ధి చేసుకుంటూ చివరి ఆయకట్టు వరకు ప్రతి ఎకరాకు నీరందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలవడానికి కృషి చేసిన ప్రతి ఒక్క రైతును అభినందిస్తున్నానని, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా, ఏ కష్టం రాకుండా జాగ్రత్తగా చూసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)