సినిమా హాళ్లలో భద్రతా ప్రమాణాలు పరిశీలించాలి
- సిపిఐ టంగుటూరు మండల కార్యదర్శి టి ప్రభాకర్ డిమాండ్
BSBNEWS - టంగుటూరు
సినిమా హాళ్లలో భద్రత ప్రమాణాలను అధికారులు పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ టంగుటూరు మండల కార్యదర్శి టి.ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టంగుటూరులోని వెంకటేశ్వర థియేటర్ లో పుష్ప 2 సినిమా చూస్తున్న ప్రేక్షకుడి తలపై సౌండ్ బాక్స్ పడి ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఆ ప్రేక్షకుడి తలకు తీవ్ర గాయాల వలన కోమాలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్న రెవెన్యూ అధికారులు పోలీసు వారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని అన్నారు. థియేటర్లలో భద్రత డొల్లతనం అర్థమవుతుందని ఒకపక్క అధిక రేట్లతో టిక్కెట్లు విక్రయిస్తూ మరొక పక్క భద్రత ప్రమాణాలను పాటించకుండా ప్రేక్షకులను ఇబ్బంది పెట్టడం సబబు కాదని అన్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

