పలు కార్యక్రమాల్లో బుర్రా

0

 పలు కార్యక్రమాల్లో బుర్రా 

BSBNEWS - కందుకూరు 


మాజీ శాసనసభ్యులు, కందుకూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని సుడిగాలి పర్యటన చేశారు. దేవాలయ శిలా ప్రతిష్ట కార్యక్రమాలతో పాటు వివాహ మహోత్సవాలు, కార్యకర్తల పరామర్శలు, కూటమి ప్రభుత్వం వేధింపులకు గురైన సోషల్ మీడియా కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ పర్యటన కొనసాగినది. ముందుగా వలేటివారిపాలెం మండలం నలదలపూరు గ్రామంలో వేంచేసిన సీతా సమేత కోదండరామ ఆలయంలో అంగ రంగ వైభోగంగా జరిగిన శిలా ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. దేవాలయ ప్రాంగణంలోని యజ్ఞశాలను సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కందుకూరు పట్టణములోని వెంగమాంబ ఫంక్షన్ హాల్ నందు జరిగిన దాసరి శ్రీనివాసులు కుమారుడు వివాహానికి హాజరయి నూతన వధూవరులను కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుని సాక్షిగా ఆశీర్వదించారు.అనంతరం గుడ్లూరు మండలంలోని వైస్ ఎంపీపీ మేనల్లుడు పోలుబోయిన వారి వివాహ కార్యక్రమంకు హాజరయి వధూవరులను ఆశీర్వదించి వారు అందించిన ఆతిధ్య మర్యాదలను స్వీకరించి వివాహ విందులో పాల్గొన్నారు.గుడ్లూరు గ్రామములోని సోషల్ మీడియా కార్యకర్త మన్వితరెడ్డి పై తప్పుడు ఆరోపణలతో కేసులు నమోదు చేస్తున్న కూటమి ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని నిరసిస్తూ ఆ కుటుంబానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్పించిన ఆర్థిక భరోసాను అందించారు. ఇదే మండలం పొట్లూరు వైఎస్ఆర్సిపి కార్యకర్త చలంచర్ల శ్రీనివాసులు  అనారోగ్యంతో ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటుండగా అక్కడికి వెళ్లి కార్యకర్తను పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకొని మనోధైర్యం తెచ్చుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ పర్యటనలో వైసిపి నాయకులు తోకల కొండయ్య, పాశం కొండయ్య, ముప్పవరపు కిషోర్, గణేశం గంగిరెడ్డి, చీమల వెంకటరాజా, షేక్ రహీమ్, కాపులూరి కృష్ణ, మాధవరెడ్డి, సిహెచ్ సురేష్, జి.రమేష్, పెన్నా కృష్ణయ్య, పులి రమేష్, చెరుకూరి బ్రహ్మయ్య, షేక్ అబ్దుల్ కలాం, మాధవ, కళ్యాణ్, జి ప్రసన్న కుమార్ తదితరులు బుర్రా వెంట ఉన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)