రైల్వే డివిజన్ యుజార్స్ కన్సల్ టేటివ్ కమిటీ సభ్యుడిగా నాదెండ్ల

0

రైల్వే డివిజన్ యుజార్స్ కన్సల్ టేటివ్ కమిటీ సభ్యుడిగా నాదెండ్ల 

BSBNEWS - ఒంగోలు 

విజయవాడ రైల్వే డివిజన్ యూసర్స్ కన్సల్ టేటివ్ కమిటీ సభ్యునిగా నాదెండ్ల సుధాకరరావు నియామక పత్రాన్ని ఆయనకు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి అందజేశారు. శనివారం మాగుంట కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తనను కమిటీ సభ్యునిగా నియమింపజేసినందుకు శ్రీనివాసులురెడ్డి కి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. రెండు సంవత్సరాలు ఈ పదవీ కాలంలో యం.పి. సహకారంతో ఈ డివిజన్ లో ప్రయాణీకుల వసతుల కల్పన  మెరుగు పరచుటలో తప్పక కృషి చేస్తానని నాదెండ్ల సుధాకరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయినాబట్టిన ఘనశ్యాం, బెల్లం సత్యనరాయణ, కండే శ్రీనివాసరావు,  కుప్పా రంగనాయకులు, తాతా ప్రసాదు, అయినబత్తిన రాము, చదలవాడ చంద్రశేఖర్,  కోటపాటి వెంకటేశ్వర్లు,  చెంచురామయ్య,  శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)