కందుకూరు తహసీల్దార్ గా లావణ్య భాద్యతలు
BSBNEWS - KANDUKUR
మండలం తహసీల్దార్ గా వి.లావణ్య సోమవారం బాధ్యతలు చేపట్టారు. కందుకూరు తహసీల్దార్ గా పని చేసిన ఇక్బాల్ ను సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవోగా బదిలీ చేస్తూ ఆస్థానంలో లావణ్యను నియమిస్తూ కొద్ది రోజుల క్రితం కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో లావణ్య సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయడం జరుగుతుందన్నారు. రైతులు కు రెవెన్యూ సంబంధించిన ఏ సమస్యనైనా కార్యాలయానికి వస్తే వాటిని పరిష్కరిస్తామని ఆమె తెలిపారు.

