తెలుగుదేశం పార్టీలో 100 పైగా కుటుంబాలు చేరికలు
అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబునాయుడు
– గొట్టిపాటి రవికుమార్
సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యత
- ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబునాయుడు సహకారంతో కందుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా
- ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
BSBNEWS - ఉలవపాడు
కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుకి మద్దతుగా ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామం నుంచి కూనం రాఘవరెడ్డి ఆధ్వర్యంలో 100 పైగా కుటుంబాలు రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా, మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు గారైతే రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతుందని నమ్మి గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీని భారీ మెజార్టీతో గెలిపించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి వైసిపి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేస్తున్నారని మంత్రివర్యులు తెలియజేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పథంలో రాష్ట్రం దూసుకుపోతుంది అని చెప్పారు. స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్టీలో చేరిన నాయకులకు స్వాగతం పలుకుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో కందుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో పాత కొత్త నాయకులందరూ కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీలో చేరిన కూనం రాఘవరెడ్డి ఆధ్వర్యంలో బద్దిపూడి పంచాయతీలో వైసీపీ పార్టీకి చెందిన వార్డు సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. కూనం రాఘవరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, కందుకూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావులను నాయకులు, కార్యకర్తలందరూ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉలవపాడు మండల పార్టీ అధ్యక్షులు రాచగల్లు సుబ్బారావు, బ్రహ్మానందరెడ్డి, అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు కూటమినేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.