మాకు జీతాలు ఇవ్వరా..?
జీతాలు అడిగితే కాంట్రాక్టర్, సూపర్ వైజర్ లు తీసేస్తామంటున్నారు
BSBNEWS - కందుకూరు
మాకు జీతాలు ఇవ్వరా అంటూ కందుకూరు పట్టణంలో ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు ప్రభుత్వాని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మాకు జీతాలు ఇచ్చేవరకు మా పోరాటం ఆపమని ఏఐటియుసి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక నిరసన ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులు మాట్లాడుతూ నాలుగు నెలల నుండి మాకు జీతాలు వేయడం లేదని, 3 సంవత్సరాల 7 నెలలు పి ఎఫ్ వేయలేదని అడిగితే పనిలోనుండి తీసేస్తామంతు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యశాలకు వచ్చే ప్రతి రోగికి మేము అనునిత్యం సేవలు చేస్తున్నామని మా చేత పనులు చేయించుకుంటున్నారు తప్ప మాకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని, మమ్మల్ని మనుషులుగా కూడా గుర్తించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో వైద్యశాలలో పని చేసే ప్రతి కార్మికుల్ని పూల వర్షంతో మమ్మల్ని అభినందించారని తరవాత రోజుల్లో పురుగుల్లా హినంగా చూడటం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. సూపర్వైజర్ సైతం కాంట్రాక్టర్ కి మద్దతు పలుకుతూ మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. వైద్యశాల సూపర్ ఇండెంట్ అడిగిన కాంట్రాక్టర్ ఇవ్వండి నేనేం చేయలేనంటూ చెప్పడం బాధాకరమని వారు పేర్కొన్నారు. మాకు న్యాయం జరిగేంతవరకు నిరసన దీక్షను కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉమ్మడి ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షులు, సిపిఐ నియోజకవర్గా కార్యదర్శి బూసి సురేష్ బాబు, ఏఐటియుసి నియోజకవర్గం కార్యదర్శి వై ఆనంద్ మోహన్, ఏఐటియుసి అధ్యక్షులు కే మురళి ప్రభుత్వ వైద్యశాల పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు