ప్రధానమంత్రి మోడీ అమరావతి పర్యటన విజయవంతం చేద్దాం
- ఇంటూరి నాగేశ్వరరావు
BSBNEWS - కందుకూరు
మే 2వ తేదీన అమరావతిలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన విజయవంతం చేద్దామని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. నరేంద్ర మోడీ అమరావతి పర్యటన నిమిత్తం తెలుగుదేశం పార్టీ పొన్నూరు ఇంచార్జ్ గా నియమించింది. సోమవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తో కలిసి నియోజకవర్గ కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. సోమవారం సాయంత్రం పొన్నూరు నియోజకవర్గానికి విచ్చేసిన ఇంటూరి నాగేశ్వరరావు ను స్థానిక శాసనసభ్యులు దూళిపాళ్ల నరేంద్ర ఘన స్వాగతం పలికారు. కూటమి నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్ర ప్రజల రాజధాని అమరావతి కి వచ్చే ప్రధానికి పెద్ద ఎత్తున జనంతో స్వాగతం పలుకుదామని, నియోజకవర్గంలోని నాయకులు ఆ విధంగా చర్యలు చేపట్టేలా కృషి చేద్దామని తెలిపారు.