మే 2 నుండి జూన్ 10 వరకు కిశోర బాల బాలికలకు స్పెషల్ సమ్మర్ క్యాంప్

0

మే 2 నుండి జూన్ 10 వరకు కిశోర బాల బాలికలకు స్పెషల్ సమ్మర్ క్యాంప్వ

BSBNEWS - VALETIVARIPALEM 

స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు కందుకూరు ప్రాజెక్ట్ పరిధిలోని వలేటివారిపాలెం మండలం అంగన్వాడి కార్యకర్తలకు ఎంపీడీవో కె.నరేంద్ర దేవ్ అధ్యక్షతన కిశోరి వికాసం వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది.  ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మే 2 నుండి జూన్ 10 వరకు కిశోర బాల బాలికలకు స్పెషల్ సమ్మర్ క్యాంప్ నిర్వహించి వారికి కుమార ప్రాయం నందు సమస్యలు, పోషణ అవసరాలు, ఆరోగ్యం, పిల్లల సంరక్షణ గురించి వాళ్ళు 12 సెషన్ లలో అవగాహన కార్యక్రమంలు నిర్వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం నకు లైన్ డిపార్ట్మెంట్స్ సీడీపీఓ శర్మిష్ట మాట్లాడుతూ ప్రతి ఒక్కరు   కిశోర బాల బాలికలకు స్పెషల్ సమ్మర్ క్యాంప్ ను తూచా తప్పకుండా నిర్వహించాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతి చిన్నారికి ఉపయోగపడుతుందని ప్రతి తల్లిదండ్రులు క్యాంపులో చెప్పే ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుని మంచి పౌష్టికాహారాన్ని చిన్నారులకు అందించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సూపెర్వైజర్ సునీత, జి ఎం ఎస్ కె లు, ఏఎన్ఎం లు, ఆశా వర్కర్ లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)