పొగాకు గిట్టుబాటు ధరపై మాజీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి

0

 పొగాకు గిట్టుబాటు ధరపై మాజీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి 

BSBNEWS - 

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాజీముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో కలిసి జిల్లా జనరల్ సెక్రెటరీ తోకల కొండయ్య విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అత్యధికంగా కందుకూరు డివిజన్ లో పొగాకు పంటను సాగు చేసే రైతులు ఉన్నారని ఈ సంవత్సరం కూడా వేలాది ఎకరాలు రైతులు పొగాకు సాగు చేశారని అయితే సరైన గిట్టుబాటు ధర రాక రైతుల తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉందని దీనిపై ఇప్పటికే రైతుల్లో ఆందోళన నెలకొని ఉన్నందువలన తమరు ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతుకు గిట్టుబాటు ధర కల్పించేదానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు సంతోషంగా లేరని ప్రతి పంటకు గిటుబాటు ధర రాక ఆందోళన చెందుతున్నారని పొగాకు రైతు పరిస్థితి కూడా అగమ్య గోచరంగా  ఉన్నందున పరిష్కారానికి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆందోళనకు కూడా సిద్ధమవుతానని తెలియజేశారు.

Post a Comment

0Comments
Post a Comment (0)