కందుకూరులో రెపరెపలాడిన ఎర్ర జెండా

0

కందుకూరులో రెపరెపలాడిన ఎర్ర జెండా 

BSBNEWS - కందుకూరు  

మే 1న మేడే సందర్భంగా కందుకూరు పట్టణంలోని అన్ని సెంటర్లలో ఎర్రజెండా రెపరెపలాడింది. సిపిఐ (భారత కమ్యూనిస్టు పార్టీ), ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పట్టణంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ముందుగా సిపిఐ కార్యాలయంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పోకూరి మాలకొండయ్య జండా ఆవిష్కరణ కార్యక్రమం చేశారు. అనంతరం రమణారెడ్డి పెట్రోల్ బంకు వద్ద ఉన్న చౌడారెడ్డి, రాఘవులు స్తూపం, కోటారెడ్డి హాస్పిటల్ వద్ద ఉన్న పెయింట్ వర్కర్స్ యూనియన్, గాంధీ బొమ్మ సెంటర్లో టైల్స్ వర్కర్స్ యూనియన్, మున్సిపల్ కార్యాలయం వద్ద, ప్రభుత్వ ఏరియా వైద్యశాల వద్ద, నాంచారమ్మ కాలనీ లో ఉన్న బొల్లోజుల మాలకొండయ్య స్తూపం వద్ద, ప్రశాంతి నగర్ కాలనీ వద్ద పలు ప్రదేశాలలో సిపిఐ, ఏఐటీయూసీ జండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా పోకూరి మాలకొండయ్య మాట్లాడుతూ కార్మికులు కష్టపడి సాధించుకున్న 44 చట్టాలను మోడీ ప్రభుత్వం నాలుగు చట్టాలుగా సవరించి కార్మికులను అణగదొక్కే ప్రయత్నాలను చేస్తుందని దానిని తిప్పి కొట్టాల్సిన అవసరం కార్మికులకు ఎంతైనా ఉందని దానికి కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎనిమిది గంటల పని దినాలను నెత్తురోడి సాధించుకున్న కార్మికులకు కనీస వేతన అమలు చేయాల్సిన ప్రభుత్వాలు వాటిని కాలరాస్తున్నాయని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ప్రజా వ్యతిరేక విధానాలను అమలు  చేస్తుందని వాటికి  రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు పలుకుతున్నాయని ఆయన అన్నారు. సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ కార్మికుల కోసం కర్షకుల కోసం పోరాడి ఎన్నో విజయాలు సాధించి అందరికీ న్యాయం చేసిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న  పార్టీలు తమ పార్టీ ఉనికి కాపాడుకోవటం కోసం ప్రయత్నిస్తున్నాయే తప్ప ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయటం లేదని ఆరోపించారు. కార్మికులకు ఉన్న హక్కులను ఎప్పటికప్పుడు వివరిస్తూ వాటిని కార్మికులు వినియోగించుకునేలా చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఆయన అన్నారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు మాట్లాడుతూ మేడే కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణం లో కందుకూరులో చేయటం ఎంతో ఆనందంగా ఉందని, కార్మికుల కోసం, కర్షకుల కోసం ఎప్పుడు నిరంతరం పనిచేస్తూ వారి శ్రేయస్సుకోసం భారత కమ్యూనిస్టు పార్టీ ముందుంటుందని ఆయన అన్నారు. జగన్ ప్రభుత్వం మోడీ ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక విధానాలకు మద్దతు తెలిపిందని మాట్లాడిన నారా చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలో వచ్చినాక జగన్ చేసిన తప్పే చేస్తున్నాడని దానికి రాబోయే ఎన్నికల్లో కార్మికులు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు కె మురళి, వై. ఆనందమోహన్, సిపిఐ కార్యవర్గ సభ్యులు ఎస్కే హుస్సేన్, నత్త రామారావు, డి ఆదినారాయణ, ఎం.లక్ష్మీనారాయణ, బొల్లోజుల బాల బ్రహ్మచారి, ఉప్పుటూరి మాధవరావు, సిహెచ్.దుర్గాప్రసాద్, బుద్ధిష్ట్ గాండ్ల హరిప్రసాద్, లాయర్ ముప్పవరపు కిషోర్, చనమాల రామారావు, మహిళా సంఘ అధ్యక్షురాలు మెండా శైలజ, ఓలేటి కల్పన, పెయింట్ వర్కర్స్ యూనియన్ నాయకులు జే రవి, బ్రహ్మయ్య, బిట్ర శీను, టైల్స్ యూనియన్ నాయకులు దార్ల సుబ్బారావు, చంద్ర, మున్సిపాలిటీ నాయకులు, కే రవణమ్మ, పులి నాగేశ్వరరావు, మెండ మహేంద్ర, బి. మణికంఠ, నీలి శెట్టి నరసయ్య, మాణికల వెంకటేశ్వర్లు, హాస్పటల్ వర్కర్స్ యూనియన్ యనమల వెంకటరత్నం, మరియమ్మ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)