జమ్మూ కాశ్మీర్లో పర్యాటకుల పై ఉగ్రవాద దాడి హేయమైన చర్య
- ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
BSBNEWS - కందుకూరు
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాద దాడిని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సాటిమనుషుల పట్ల ఇలా అమానుషంగా ప్రవర్తించడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏపీ వాసులు చంద్రమౌళి, మధుసూధన్, ఇతర ప్రాంతాలకు చెందిన వారి మృతిపట్ల ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సంతాపం తెలియజేశారు.