తండ్రి వర్ధంతికి రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచిన తనయుడు

0

 తండ్రి వర్ధంతికి రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచిన తనయుడు

BSBNEWS - కందుకూరు 

మండలంలోని కొండముడుసు పాలెం గ్రామానికి చెందిన తలమంచి వంశీ తండ్రి తలమంచి శ్రీను మొదటి వర్ధంతి సందర్భంగా కందుకూరు ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ నందు రక్త దానం చేసి వాళ్ళ తండ్రికి ఘనమైన నివాళులు అర్పించారు. ఇలా వర్ధంతికి రక్తదానంతో నివాళులు అర్పించి కందుకూరు పట్టణ యువతకి ఒక మంచి సంస్కృతితో స్పూర్తిగా నిలిచిన తలమంచి వంశీకి కందుకూరు ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ షాజుద్దీన్, కందుకూరు రెడ్ క్రాస్ చైర్మన్ చన్నా వెంకట రామాంజనేయులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కందుకూరు రెడ్ క్రాస్ చైర్మన్ చన్నా వెంకట రామాంజనేయులు మాట్లాడుతూ యువత అందరూ మీ రక్తదానంతో మీకు ఇష్టమైన వారి పుట్టినరోజులకి, పెళ్ళిరోజులకి శుభాకాంక్షలు, జయంతి, వర్థంతిలకు నివాళులు అర్పించి తద్వారా ఈ ఎండాకాలంలో రక్తం దొరక్క ఇబ్బంది పడే మరొక కుటుంబంలో సంతోషాలు నింపాలని, ఆరోగ్యవంతమైన యువత అందరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని ఆకాంక్షించారు.

Post a Comment

0Comments
Post a Comment (0)