టెర్రరిస్ట్‌ల దాడిని తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు

0

 టెర్రరిస్ట్‌ల దాడిని తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు

BSBNEWS -

జమ్ముకశ్మీర్‌ ఉగ్రదాడిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌ వాసుల మరణంపై ఉమ్మడి ప్రకాశం జిల్లా శాసనమండలి సభ్యులు తూమాటి మాధవరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటనలో టెర్రరిస్ట్‌ల దాడిని తీవ్రంగా ఖండించారు. బాధిత కుటంబీకులకు మాధవరావు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి మృతులకు సంతాపం ప్రకటించారు. ఆ కుటుంబాలను ఆదుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్య అని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు పేర్కొన్నారు. బాధిత కటుంబాలను ఆదుకుని అండగా నిలవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

Post a Comment

0Comments
Post a Comment (0)