వాహనములపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన టి.వి.యన్ లక్ష్మీ
BSBNEWS - కందుకూరు
పట్టణంలోని పామూరు బస్టాండ్ సర్కిల్ నందు వాహనములపై కందుకూరు ప్రాంతీయ రవాణాశాఖ అధికారి టి.వి.యన్ లక్ష్మీ బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ రవాణశాఖాధికారి టివియన్ నాగ లక్ష్మీ వాహనచోదకులకు రహదారి భద్రత పై అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనమును నడుపునపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, వాహనములలో ఉంచుకోవలసిన ధృవీకరణ పత్రముల గురించి తెలియచేస్తూ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తరువాతనే వాహనములను నడుపవలెనని తెలియచేశారు. కందుకూరు మోటారు వాహనముల తనిఖీ అధికారి చెన్నూరి రాంబాబు. మాట్లాడుతూ వాహన చోదకులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించి, వాహనముల యొక్క ధ్రువపత్రాలను పరిశీలించారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా సీటు బెల్ట్ లేకుండా ప్రయాణం చేయుచున్న 2 మోటారు కార్ వాహనములను, పరిమితిని మించి ప్రయాణం చేయుచున్న 2 ఆటో రిక్షాలకు, ఒక గూడ్స్ వాహనములకు డ్రైవింగ్ లైసెన్స్ లేని కారణముగా కేసు నమోదు చేశారు.

