10వ తరగతి పరీక్షా ఫలితాలలో బి ఆర్ ఆక్స్ ఫర్డ్ విద్యార్థుల విజయ ఢంకా

0

10వ తరగతి పరీక్షా ఫలితాలలో బి ఆర్ ఆక్స్ ఫర్డ్ విద్యార్థుల విజయ ఢంకా

BSBNEWS -కందుకూరు 

పట్టణంలోని పామూరు రోడ్ లో గల బి ఆర్ ఆక్స్ ఫర్డ్ ఒలంపియాడ్ స్కూల్ విద్యార్థులు బుధవారం విడుదలైన 2025 మార్చిలో జరిగిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలలో అద్భుత ఫలితాలు సాధించారని  బి ఆర్ ఆక్స్ ఫర్డ్ విద్యా సంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దామా రక్షణ (594/600) టౌన్ ఫస్ట్ గా నిలిచిందని, కె.షన్విత హాసిని (593) , కె.వేదశ్రి (592), యు. అమూల్య (592), డి.యువ సంజయ్ (592) లు అత్యుత్తమ మార్కులు సాధించారని, 590 పైగా మార్కులు 17 మంది, 580 కి పైగా మార్కులు 40 మంది, 550 కి పైగా మార్కులు 97 మంది, 500 కు పైగా మార్కులు 181 మంది విద్యార్థులు సాధించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఇంతటి అద్భుతమైన ఫలితాలను సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను  బి ఆర్ ఆక్స్ ఫర్డ్ విద్యాసంస్థల చైర్మన్ ఉన్నం భాస్కరరావు, కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్స్ జి బాల భాస్కరరావు, బి నరేంద్రబాబు లు ప్రత్యేకంగా అభినందించారు.

Post a Comment

0Comments
Post a Comment (0)