ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అభినందించిన కందుకూరు షైన్ ఫౌండేషన్
BSBNEWS - కందుకూరు
షైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో కందుకూరు పట్టణ ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థి షేక్ షాజియా ఆ పాఠశాలలో ఉత్తమ ఫలితాలను సాధించిన సందర్భంగా ఫౌండేషన్ సంస్థ సభ్యులు ఆమె ఇంటికి చేరుకొని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు షేక్ రహీం మాట్లాడుతూ విద్యా విజ్ఞానాన్ని అందిస్తుందని, చదువుతూనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, ఉత్తమ ఫలితం సాధించిన షాజియా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. తల్లిదండ్రులతో పాటు గురువులకు మంచి పేరు తెచ్చే విధంగా క్రమశిక్షణతో ఎదగాలని ఆకాంక్షించారు. ఇటువంటి ఉత్తమ ఫలితాలను సాధించిన పేద కుటుంబాల విద్యార్థులకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ద్వారకా రాణి, పాఠశాల సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసాక్షి అధినేత ఎరమాల నాగభూషణం, రేణమాల అయ్యన్న ,బాబు, సుల్తాన్, నయీమ్ బాషా తదితరులు పాల్గొన్నారు