ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

0

ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన  ఎమ్మెల్యే

BSBNEWS - కందుకూరు  



పట్టణంలోని టి. ఆర్. ఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఈ డబ్ల్యూ ఎస్ కార్పొరేషన్  వారి సహకారంతో కందుకూరు పట్టణ, మండల  మహిళల కొరకు ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని మంగళవారం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు కేవలం భర్త సంపాదన పైనే ఆధారపడకుండా టైలరింగ్ నేర్చుకుని తద్వారా వచ్చే సంపాదనతో ప్రతి కుటుంబం ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల పేరుతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మహిళలందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. కందుకూరు పట్టణ, మండల మహిళలకు ఉచిత టైలరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో శుభపరిణామమని ప్రతి మహిళ టైలరింగ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టైలరింగ్ నిపుణుల ద్వారా   శిక్షణ ఇప్పించి 90 రోజుల తర్వాత ఉచితంగా కుట్టు మిషన్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ముందుగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుని టైలరింగ్ శిక్షణకు విచ్చేసిన మహిళలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, రూరల్ మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య, పట్టణ టిడిపి మాజీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు, బిజెపి పార్టీ నాయకులు ఘట్టమనేని హరిబాబు పార్టీ నాయకులు ఉప్పుటూరి శ్రీనివాసరావు, చదలవాడ కొండయ్య, షేక్ రఫీ, చిలకపాటి మధుబాబు, బెజవాడ ప్రసాద్, వడ్డెళ్ళ రవిచంద్ర, ముచ్చు శ్రీను, మహర్షి శ్రీను, అత్తంటి శ్రీహరి నాయుడు, గడ్డం మాలకొండయ్య, పొడపాటి మహేష్, చుండూరి శ్రీను, పువ్వాడి కోటయ్య, భవనాసి  వెంకటేశ్వర్లు, షేక్ నాగూర్, గుర్రం మధు, కళ్యాణ్, మహిళా నాయకులు కల్లూరి శైలజ బత్తిన ఆదెమ్మ, కంసాని మయూరి, ఎస్తేరమ్మ, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)