నక్షత్ర గ్రాండ్ హోటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి

0

నక్షత్ర గ్రాండ్ హోటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి


BSBNEWS - కందుకూరు


పట్టణంలోని పామూరు రోడ్ లో వలేటివారిపాలెం  మండలం నలదలపూరు గ్రామానికి చెందిన మన్నం కృష్ణ  ఆహ్వానం మేరకు నక్షత్ర గ్రాండ్ హోటల్ ను బుధవారం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ముందుగా ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి నిర్వాహకులు మన్నం కృష్ణ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు,  వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, చిలకపాటి మధుబాబు, వడ్డెళ్ళ రవిచంద్ర, షేక్ రఫీ, రావూరి రామకోటయ్య, చుండూరి శ్రీనివాసరావు, కొమ్మి ప్రవీణ్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)