అన్నా క్యాంటీన్ లో ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ జన్మదిన వేడుకలు
BSBNEWS - కందుకూరు
కుప్పంనియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ జన్మదిన వేడుకలు స్థానిక అన్న క్యాంటీన్ నందు తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించడం జరిగింది. కందుకూరు టిడిపి పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షుడు నార్నే రోశయ్య ఆధ్వర్యంలో అన్నక్యాంటీన్ నందు కేక్ కటింగ్ చేసి, పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు ఎమ్మెల్సీగా గెలిచి చరిత్ర సృష్టించాడని అన్నారు. అలాంటి శ్రీకాంత్ ఆయురారోగ్యాలతో తెలుగుదేశం పార్టీకి ప్రజలకు మరిన్ని సేవలందించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చిలకపాటి మధు, గడ్డం మాలకొండయ్య, వడ్డెళ్ళ రవిచంద్ర, పువ్వాడి కోటయ్య, రావూరి రామకోటయ్య, కొత్తూరి సుధాకర్, ముప్పవరపు వేణు, తెలుగు యువత నాయకులు పొడపాటి మహేష్, పోకూరి రాంబాబు, గుర్రం మధు, చవిడిబోయిన కృష్ణ, చుండూరి శ్రీకాంత్, మురారిశెట్టి సుధీర్, కోటా కిషోర్, చక్కా కేశవరావు, ఇస్కాల మధు, శివ, మనోహర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రీకాంత్ స్నేహితులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.